హనుమద్వాహనంలో ఊరేగిన శ్రీవారుహనుమద్వాహనంలో ఊరేగిన శ్రీవారు

తిరుమల,అక్టోబర్‌5 (జనంసాక్షి): కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్ర¬్మత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. ఆరో రోజున దేవదేవుడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. హనుమంతుడు భగవత్‌ భక్తుల్లో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడిగా, వ్యాకరణ పండితుడిగా.. లంకా భీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు.. తిరుమలేశుని తన మూపున వహించి తిరువీధుల్లో దర్శనమిచ్చే ఘట్టం భక్తజన రంజితం. హనుమంతుడ్ని స్మరిస్తే.. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, అజాడ్యం లభిస్తాయని పురాణ వచనం. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.