హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టులో పోటెత్తిన భక్తులు
కరీంనగర్, జనంసాక్షి: ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి హనుమాన్ జయంతి సందర్బంగా భక్తులు పోటెత్తారు. 41 రోజులపాటు దీక్ష నిర్వహించి హనుమాన్ మాలధారులు నేడు మాల విరమణకు సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. వివిధ జిల్లాల నుంచి భక్తులతో ఆలయం కిక్కిరిసింది.