హనుమాన్ జయంతికి ముస్తాబైన కొండగట్టు

slohxmwhకరీంనగర్ జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్రం.. ఆంజనేయ స్వామి జయంతోత్సవాలకు ముస్తాబు అయింది. ఈ నెల 4వ తారీఖున జరగనున్న ఆంజనేయ స్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆంజనేయ స్వామి భక్తులు భారీగా తరలి వస్తారని ఆలయ అర్చకులు చెపుతున్నారు. ప్రతి యేడాది లాగే ఆంజనేయ మాలాధారణ విరమణ కోసం వచ్చే వేలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. కొండగట్టు క్షేత్రంలో నెలకొన్న సమస్యలను తీర్చాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి యేడు కొండకు వచ్చే వేలాది మంది భక్తులు.. ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెపుతున్నారు. స్నానఘట్టం కోనేరులో నీటి సౌకర్యం కూడా సరిగ్గా లేదని ఆరోపిస్తున్నారు. స్వామి వారి జయంతిని పురస్కరించుకొని అశేష సంఖ్యలో భక్తులు రానుండడంతో ఆలయ అధికారులు అదేస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.