హరితహారంతోనే మనుగడ
మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి: ఎమ్మెల్యే
జగిత్యాల,ఆగస్ట్17(జనం సాక్షి): అడవుల ధ్వంసంతో గ్రామాల్లోకి వచ్చిన కోతులు తిరిగి అడవులకు వెళ్లాలనే, వానలు వాపస్ రావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద ఎత్తున హరితహారాన్ని ప్రోత్సహిస్తు న్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. మానవ మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమనీ, పచ్చదనం, పరిశుభ్రతను మెరుగు పరిచేందుకు జిల్లాలో చేపట్టిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. మొక్కల పెంపకంలో ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు జిల్లాకేంద్రంలో శ్రీగంధం మొక్కలనూ ఇంటింటికీ పంపిణీ చేస్తున్నామన్నారు. హరితహారంలో భాగంగా అటవీ శాఖ ద్వారా పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 286లక్షల మొక్కలను అందుబాటులో ఉంచామన్నారు. మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా సాగిస్తున్నామనీ, ఇప్పటికే కోటి మొక్కలు నాటామని వివరించారు. ఇకపోతే
ప్రపంచంలోనే అతి పెద్దదైన లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరమనీ, ఈ ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకంలో భాగంగా రాంపూర్, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తి కావచ్చిందనీ, ఇక వరద కాలువలో 365రోజులూ నీరుంటుందనీ, ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాల్లోనూ ఏటా రెండు పంటలు సాగయ్యే అవకాశం కలుగుతుందని వివరించారు. పెంచిన పింఛన్లు అందిస్తుండడంతో లబ్దిదారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్న దన్నారు. కేసీఆర్ కిట్ గర్భిణులకు వరంలా మారిందని తెలిపారు. ఈ పథకంతో ప్రభుత్వ వైద్యశాల్లో ప్రసవాలు 74శాతానికి పెరిగాయనీ, మాతాశిశు మరణాల రేటును కూడా తగ్గించగలిగామన్నారు.
గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా గొర్రెలు, పాడి పశువుల పంపిణీ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తూ మిగతా రాష్టాల్రకు ఆదర్శంగా నిలిచామన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు.