హరితహారంలో భాగంగా విధిగా మొక్కలు నాటాలి.. పర్యావరణాన్ని రక్షించాలి

చౌడాపూర్, జులై 19( జనం సాక్షి): వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్ర పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి.. పర్యావరణాన్ని సంరక్షించాలని మంగళవారం రోజు చౌడపూర్ గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటి మరియు అదే విధంగా మహిళా సంఘాల సభ్యులకు ప్రతి ఒక్కరికి ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి మొక్క బతకాలి,పచ్చదనం పెరగాలే, క్షీణించిన అడవులు మళ్లీ దట్టంగా అల్లుకోవాలి అనే లక్ష్యంతో కెసిఆర్ తలపెట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తూ, తెలంగాణ పచ్చదనం దేశానికే నమూనాగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కొత్త రంగారెడ్డి, మరియు స్థానిక ఎంపీటీసీ శంకర్, ఉప సర్పంచ్ శివకుమార్, పంచాయతీ కార్యదర్శి రాజిరెడ్డి, వార్డు మెంబర్లు అశోక్, రామకృష్ణ, యాదయ్య, రాజు మరియు మహిళా సంఘాల సభ్యులు పాల్గొనడం జరిగింది.
Attachments area