హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేద్దాం తెలంగాణ సర్పంచ్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కే సురేష్

మోమిన్ పేట ఆగస్టు 26 జనం సాక్షి
హరితహారం కార్యక్రమం.. పుడమితల్లికి వెలకట్టలేని ఆభరణమని అభివర్ణించారు తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్. శనివారం మండల పరిధిలోని చిన్న కోల్పోకుండా గ్రామంలో హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం ఈ హరిత హారం అన్నారు. తెలంగాణ’
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు హరితోత్సవాలను అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తోందని, ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ ఉద్యమంలా చేపట్టిన హరితహారం కార్యక్రమ ప్రాముఖ్యత గురించి.. అది ఎన్నో విజయాలను సాధించిందని పేర్కొన్నారు. ముంచుకొస్తున్న ప్రకృతి విపత్తులను అరికట్టి.. పర్యావరణ సమతుల్యత కాపాడుకోవాలంటే.. మానవజాతి చేతిలో ఉన్న ఏకైక బ్రహ్మస్త్రం హరితహారం అని ఆయన అభిప్రాయపడ్డారు. గత నాలుగేళ్లుగా గ్రామంలో 20 వేల వరకు మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఈ యేడాది 8 వేల మొక్కలు నాటేందుకు సంకల్పించామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఏ జంగయ్య, ఎఫ్ఏ భుజంగం, నారాయణ, సుధాకర్, రాజయ్య, రాజు, సుభాన్, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.