హరితహారం పథకంలో ఇరిగేషన్. పల్లె ప్రకృతి వనం. వీడియో ప్రాంగణాల అభివృద్ధిపై సమీక్ష
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
నల్గొండ బ్యూరో.జనం సాక్షి
తెలంగాణకు హరితహారం పథకంలో భాగంగా ఇరిగేషన్ శాఖ భూములలో మొక్కలు నాటుట, బృహత్ పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణంకు బయో ఫెన్సింగ్, లేబర్ మొబిలైజేషన్, యన్.యం.యం.యస్. ఆప్ లో కూలీల హాజరు పంపుట, రిజేక్టేడు అకౌంట్స్, మస్టర్ రోల్ పెండింగ్, యస్.బి.యం., అమృత్ సరోవర్ పురోగతిపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సమీక్షించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ నుండి ఎ.పి.డి.లు, పంచాయితీరాజ్ ఇంజనీర్లు, ఎం.పి.డి.ఓ.లు, ఎం.పి.ఓ.లను, ఎ.పి.ఓ.లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు హరిత హారంలో మిగిలిన అన్ని ప్లాంటేషన్లకు అవసరమైన ప్రదేశాలు గుర్తించి 100% అంచనాలు తయారుచేయాల్సిందిగా యం.పి.డి.ఓ.లు, యం.పి.ఓ.లు,ఏ.పి.ఓ.లను కలెక్టర్ ఆదేశించారు. తెలంగాణకు హరిత హారంలో ప్రతి మండలానికి కేటాయించిన లక్ష్యంలో 50% మొక్కలు నాటడంతోపాటు నాటిన అన్ని మొక్కలకు 100% జియో ట్యాగింగ్ పూర్తిచేయాలని ఆయన తెలిపారు. డంపింగ్ యార్డులు, వైకుంఠదామాలు, సేగ్రిగేషన్ షేడ్స్ మరియు తెలంగాణ క్రీడా ప్రాంగణంల చుట్టూ బయో ఫెన్సింగ్ చేయడంతోపాటు అన్నింటిలో పంచాయితీ కార్యదర్శులచేత మొక్కలు నాటాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి గ్రామపంచాయితీలో 25 మందికి తక్కువ కాకుండా కూలీలకు ఉపాధిహామీ పనులు కల్పింఛి గుంతలు తీయించే పనులు చేయించాలని ఆయన అన్నారు. బ్యాంక్ అకౌంటు రిజెక్ట్ అయిన కూలీలతో కొత్త అకౌంటు తీయించి వెంటనే సాఫ్ట్ వేర్ లో అప్ డేట్ చేయాలని తద్వారా రిజేక్టేడు అకౌంటులను, పెండింగ్లో ఉన్న మస్టర్లను పూర్తిచేయాలని ఆయన అధికారులను కోరారు. అమృత్ సరోవర్ పథకం కింద జిల్లాలో ఆగష్టు 15 వ తేదీ వరకు 15 అమృత్ సరోవర్ పాండ్స్/ వాటర్ బాడీస్ 100% పూర్తిచేయాలని ఆయన అధికారులను కోరారు. అమృత్ సరోవర్ పథకం క్రింద జిల్లాలో ఉన్న 75 అమృత్ సరోవర్ పాండ్స్/ వాటర్ బాడీస్ లను స్వాతంత్య్ల దినోత్సవం రోజున ప్రారంభించుటకు గ్రామపంచాయితీలో ఉన్న పెద్దమనిషి పేరు, ఫోన్ నెంబరుతో కూడిన వివరాలను పంచాయితీ కార్యదర్శి అమృత్ సరోవర్ అప్ లో రేపటివరకు అప్ లోడ్ చేయాలని ఆయన ఆదేశించారు. యస్.బి.యం.లో భాగంగా జిల్లాకు కొత్తగా 6000 మరుగుదొడ్లు మంజూరీ అయ్యాయని అవసరమున్న లబ్దిదారులను గుర్తించాలని ఆయన సంబంధిత అధికారులను కోరారు.
ఈ వీడియో కాన్పరెన్సులో జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. ప్రేమ్ కరణ్ రెడ్డి, డి.ఆర్.డి.ఓ. కాళిందిని, తదితరులు పాల్గొన్నారు.