హస్తిన బాట పట్టనున్న డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర రాజకీయాలతో హస్తిన వేడెక్కింది. రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిమాణాలపై అధిష్టాన పెద్దలతో ఇప్పటికే ఢల్లీిలో మకాం వేసిన బొత్స మంతనాలు జరుపుతున్నారు. ఇవాళ రాత్రికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హస్తిన బాట పట్టనున్నారు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ, జానారెడ్డి ఢల్లీిలో మకాం వేశారు. అధిష్టాన పెద్దలతో తెలంగాణ అంశం, కేబినేట్‌ విస్తరణ,డీఎల్‌ రదీంద్రారెడ్డి బర్తరఫ్‌ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నెల 5 న ఉదయం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఢల్లీి వెళ్లనున్నారు. దీంతో హస్తినలో  రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి