హార్ధిక్‌పటేల్ విడుదల
అహ్మదాబాద్,జులై 15(జనంసాక్షి):సుమారు 9 నెలల తర్వాత జైలు జీవితం నుంచి హార్థిక్ పటేల్‌కు విముక్తి అభించింది. పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి నేత హార్దిక్ పటేల్ గుజరాత్‌లో పటేల్ కులస్థులకు రిజర్వేషన్లు కల్పించాలని గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. దేశద్రోహం నేరం కింద అరెస్టు చేసిన ఆయనకు ఇటీవల బెయిల్ లభించడంతో శుక్రవారం సూరత్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆందోళనల సమయంలో హార్దిక్‌పై అహ్మదాబాద్, సూరత్ రెండు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లోనూ గతవారం బెయిల్ లభించింది. మరో కేసులో ఈ వారం బెయిల్ లభించడంతో జైలు నుంచి విడుదలయ్యారు. ఎన్నో సార్లు బెయిల్ నిరాకరణ అనంతరం గుజరాత్ హైకోర్టు అతడికి షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆర్నెల్ల పాటు గుజరాత్‌లో ఉండొద్దని షరతు విధించిన సంగతి తెలిసిందే. దీంతో అతను విడుదల అయినా గుజరాత్ బయట ఉండాల్సి ఉంటుంది