హావిూలను విస్మరించిన టిఆర్ఎస్ ప్రభుత్వం: రేవూరి
వరంగల్ రూరల్,సెప్టెంబర్1(జనం సాక్షి): ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలను విస్మరించిన టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిపై ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రగతి నివేదనలో ముందుగా అనేక వైఫల్యాలను ప్రస్తావించి నిబద్దన చాటుకోవాలన్నారు. నర్సంపేట పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టడానికే ప్రగతినివేదన సభ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హావిూలను విస్మరించిందని రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, డబుల్బెడ్రూం ఇళ్లను ఇస్తానన్న ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.