హాస్టల్ ను తనిఖీ చేసిన ఎంపీపీ

మిర్యాలగూడ.జనం సాక్షి.
మిర్యాలగూడ పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్ ను ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి ఎంపీడీవో జ్యోతిలక్ష్మి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతలను పరిశీలించారు. వంటల తయారిని చూసి, నాణ్యమైన భోజన విషయంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వసతి గృహాలలో ఫుడ్ పాయిజన్ ద్వారా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని అందులో భాగంగానే తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. విద్యార్థులకు అందించే భోజన విషయంలో రాజీ పడొద్దని, నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. మెనూ పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డెన్ సావిత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా ఈడులగూడ లో గల గిరిజన బాలుర వసతి గృహాన్ని కూడా తనిఖీ చేసారు. వార్డెన్ సతీష్ ఉన్నారు.

తాజావార్తలు