హిందువుల మనోభావాలు.. దెబ్బతినేలా జగన్‌ పాలన

 

– ఎన్నిసార్లు హెచ్చరించిన తీరుమారడం లేదు

– సాధుపరిషత్‌ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి

గుంటూరు, నవంబర్‌27(జనం సాక్షి) : ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్‌ పాలన ఉందని రాష్ట్ర సాధు పరిషత్‌ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి విమర్శించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నో సార్లు హెచ్చరించిన జగన్‌ తీరు మారడం లేదన్నారు. రాష్ట్రంలో హిందూ ధర్మం కోసం సాధు సమితి కృషి చేస్తుందన్నారు. తిరుమల దేవస్థానంలో అన్యమతస్థల ఉద్యోగులను తోలింగించాలని డిమాండ్‌ చేశారు. హిందుత్వ వ్యతిరేక చర్యలను ప్రశ్నించివందికే ఎల్వీని అడ్డుతొలగించారని స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆరోపించారు. అవమానకర రీతిలో ఎల్వీ సుబ్రమణ్యంను తొలగించారన్నారు. ఏపీలో హిందువులను ఏకం చేస్తామని, హిందూ ధర్మాన్ని కాపాడే వారికే ఓట్లు వేసే విధంగా చూస్తామన్నారు. జగన్‌ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆయన సూచించారు. గుంటూరులో తొలింగించిన అమ్మవారి ఆలయాన్ని తిరిగి నిర్మాంచాలని డిమాండ్‌ చేశారు. హిందూ దేవాలయల నుంచి వచ్చే ఆదాయం దేవాలయలకే ఖర్చు చేయాలని స్వామి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్‌ చేశారు.