హిందూ స్మశానవాటికను పర్యవేక్షించిన మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్
నిర్మల్ బ్యూరో, అక్టోబర్10,జనంసాక్షి,,, జిల్లా కేంద్రంలోని శివాజిచౌక్ నందు రాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కృషి, సహకారంతో ఏర్పాటు చేస్తున్న హిందూ స్మశాన వాటికను సోమవారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే మోడల్ వైకుంఠదామం గా మంత్రి గారి సహకరంతో నిర్మాణం చేపడుతున్నాం అన్నారు.అనివార్య కారణాల వల్ల నిర్మాణం పనులు ఆలస్యం కావటం జరిగిందన్నారు.రానున్న రెండు మాసాల్లో పూర్తి స్థాయిలో నిర్మాణం పనులు చేపడతాం అన్నారు.
దహన సంస్కరాలకు వీలుగా మున్సిపల్ కౌన్సిల్ పరంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసాం అన్నారు .ఈరోజు నుండి దహన సంస్కరలకి అందుబాటులో ఉంటుందన్నారు.దహన సంస్కారాలకు బర్మింగ్ ప్లాట్ ఫామ్స్, సిట్టింగ్ ఛైర్స్,పచ్చని ప్రకృతి వనం,స్వాగత ఆర్చ్,పరమ శివుని ప్రతిమ,స్నానపు గదులు,మంచి నీరు,అన్ని రకాల సదుపాయాలతో అత్యాధునికంగా ఏర్పాటు చేస్తున్నాం అన్నారు.ఈకార్యక్రమంలో డి.ఈ -నాగేశ్వరరావు,
సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్,కౌన్సిలర్స్ లక్కాకుల నరహరి, రామగౌని తులసి నర్సాగౌడ్,ప్రధాన కార్యదర్శి-అడప పోశెట్టి,మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
Attachments area