హిమాయత్‌నగర్‌లో ఓ ఇంట్లో పేలుడు
హైదరాబాద్, జనంసాక్షి: నగరంలోని హిమాయత్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. అగ్నిమాపక శాఖకు చెందిన ఉద్యోగి ఉప్పలయ్య ఇంట్లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఉప్పలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, నాటుబాంబు కారణంగానే పేలుడు సంభవించి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్దరణకు వచ్చారు.