హుజూరాబాద్‌లో క్యూకట్టిన ఓటర్లు
మద్యాహ్నానానికి 61.66 శాతంఓటింగ్
ఓటు హక్కు వినియోగించుకున్న గెల్లు దంపతులు
గ్రామాల్లో సైతం భారీగా నమోదవుతున్న పోలింగ్
పోలింగ్ కేంద్రం వద్ద కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న బిజెపి నేతలు
హుజూరాబాద్,అక్టోబర్30 (జనంసాక్షి) : హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగతుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు హుజూరాబాద్‌లో 61.66 శాతం పోలింగ్ నమోదయ్యింది. హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి హిమ్మత్‌నగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ప్రతిఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. అంతకుముందు గెల్లు శ్రీనివాస్ దంపతులు ఇంట్లో దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. తల్లి పాదాలకు నమస్కరించి పోలింగ్ కేంద్రానికి బయల్దేరారు. హుజూరాబాద్‌లో పోలింగ్ ప్రశాంతంగా జరగడంతో పాటు భారీగా పోలింగ్ నమోదవుతున్నది. ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం ఓటింగ్ నమోదయింది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్, జమ్మికుంట మండలాల్లో భారీ సంఖ్యలో ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, ఇల్లందకుంటలో కొంత నెమ్మదిగా కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకు హుజూరాబాద్‌లో 28.64 శాతం, వీణవంకలో 28.72 శాతం, జమ్మికుంటలో 27.03 శాతం, ఇల్లంద కుంటలో 24.83 శాతం, కమలాపూర్‌లో 27.71 శాతం ఓట్లు నమోదయ్యాయి. కాగా, పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రికార్డు స్థాయిలో ఓట్లు నమోదయ్యే అవకాశం ఉందని నాయకులు అంచనా వేస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. జమ్మికుంటలో మినహా మిగిలిన నాలుగు మండలాల్లో ఉదయం నుంచే భారీగా పోలింగ్ నమోదవుతున్నది. దీంతో ఉదయం 9 గంటవరకు 10.05 శాతం ఓట్లు నమోవదగా, 11 గంటలకు అది 33.27 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇదిలావుంటే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం నిర్వహిస్తున్న టిఆర్‌ఎస్ నేత కౌశిక్ రెడ్డిని బిజెపి నేతలు నిలదీసారు. తను టీఆర్‌ఎస్ పార్టీ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నాను. తనకు పోలింగ్ బూతుల వద్దకు వెళ్లే అధికారం ఉందని ,బీజేపీ వాళ్లు ఎలా అడ్డకుంటారు? ఎందుకు అడ్డుకుంటారని ఆయన ప్రశ్నించారు. కేవలం ఓడిపోతామనే
ఫ్రస్టేష్రన్‌తోనే ఇలా ప్రవర్తిస్తున్నారు. బీజేపీ నేతలకు ప్రజలు కచ్చితంగా ఓటుతో బుద్ధి చెబుతారని టీఆర్‌ఎస్ నేత పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా ఆయన పలు పోలింగ్ బూతులను సందర్శిస్తుంటే పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నట్లు బీజేపీ నేతలు చిత్రీకరించారని మండిపడ్డారు కౌశిక్‌రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ’తాను టీఆర్‌ఎస్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నా. నాకు రాజ్యాంగం ప్రకారం 305 పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది. నా వెనుక టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ లేరు. అయినా బీజేపీ నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కొందరు మహిళలు గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టుకుని ఓటేయడానికి వెళ్తున్నారు. గత కొన్నిరోజులుగా పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్ సిలిండర్ ధరలు కూడా క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. తర్వలోనే సిండర్ బండ ధర రూ.వెయ్యికి చేరనున్నాయనే వార్తలు వస్తున్నాయి. నేపథ్యంలో పెరుగుతున్న ధరతో తాము మళ్లీ క్టటెల పొయ్యి వైపు మళ్లాల్సి వస్తున్నదని, బండభారం తాము మోయలేమని సామాన్య ప్రజలు అంటున్నారు. ఈ ఎన్నికల ద్వారా పెరుగుతున్న ధరలపై కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి తమ వ్యతిరేకతను తెలుపుతామంటున్నారు.