హుజూర్ నగర్ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న ఉత్తమ్ పద్మావతి దంపతులు
హుజూర్ నగర్ ఆగస్టు 21 (జనం సాక్షి): నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ మాజీ శాసన సభ్యురాలు పద్మావతి తెలంగాణ రాష్ట్రంలోని అతి పెద్ద జాతర అయినటువంటి హుజూర్ నగర్ గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి జాతరలో పాల్గొని అమ్మవారిని ఉత్తమ్ దంపతులు దర్శించుకున్నారు. అదివారం ఆలయ కమిటీ వారు ఉత్తమ్ పద్మావతి దంపతులకు ఘనంగా స్వాగతం పలికి పూలమాల శాలువలతో సన్మానించినారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు దేవాలయ అభివృద్ధికి చాలా కృషి చేశానని, అమ్మవారిని మొదటి దర్శనం చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని, అమ్మవారి దయవల్ల ప్రజలందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకున్నానని అదేవిధంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినటువంటి ఆలయ కమిటీ వారిని కూడా అభినందించారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ ఎరగాని నాగన్న గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్ కుమార్ దేశ్ముఖ, సుంకరి శివరాం యాదవ్, కోతి సంపత్ రెడ్డీ, చింతకాయల రాము, మేళ్లచెరువు ముక్కంటి, తెప్పని వెలమంద, వేముల నాగరాజు, వేముల వెంకన్న, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు