హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ నిమజ్జనంపై హైకోర్టులో పిటీషన్‌

4

హైదరాబాద్‌, ఆగస్ట్‌17(జనంసాక్షి):

హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సాగర్‌లో వినయాక విగ్రహాలను నిమజ్జనం చేయకపోవడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 15 అడుగులలోపు విగ్రహాలను నిమజ్జనంచేస్తే అభ్యంతరం ఏమిటని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది. దీని వల్ల వచ్చే సమస్యలు ఏమి లేవని హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు కోర్టు వాయిదా వేసింది.

వారణాసిలో విగ్రహ నిమజ్జనపై నిషేధం.

వారణాసిలో విగ్రహ నిమజ్జనపై అధికారులు నిషేధం విధించారు. త్వరలో జరగనున్న వినాయక చవితి, దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గంగ, యమున నదుల్లో విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని అలహాబాద్‌ హైకోర్టు ఆదేశించడంతో వారణాసి అధికార యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది. అధికారులు సూచించిన ప్రాంతాలోని సరస్సుల్లోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలని అధికారులు స్పష్టం చేశారు.