హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌,(జనంసాక్షి): శంకర్‌పల్లి హెచ్‌ఎండీఏ కార్యాలయంలో విద్యుత్‌ఘాతంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు క్యాబిన్లలో ఫర్నిచర్‌ సహా పలు దస్త్రాలు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.