హెలీప్యాడ్‌ ధ్వంసం

హుజూరాబాద్‌ , న్యూస్‌లైన్‌: క్రీడల నిర్వాహణ కోసం ఏకంగా శాశ్వత హెలీప్యాడ్‌నే ధ్వంసం చేసిన సంఘటన హుజూరాబాద్‌లో చోటు చేసుకుంది. గత ఏడాది

సెప్టెంబర్‌ నెలలో గవర్నర్‌ నరసింహన్‌ జిల్లా పర్యటన నిమిత్తం హుజూరాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో శాశ్వత హెలీప్యాడ్‌ నిర్మాణం చేపట్టారు. ఆర్‌అండ్‌బీ అధికారుల ఆధ్వర్యంలో సుమారు నాలుగు రోజులపాటు, క్వాలిటీ కంట్రోల్‌ అధికారుల సమక్షంలో నిర్మించారు. అప్పుడు హెలీప్యాడ్‌ పనులను సాక్షాత్తు కలెక్టర్‌ స్మితాసబర్వాల్‌, జేసీ, ఎస్పీలు పర్యవేక్షించారు. అయితే రూ. 2లక్షలతో నిర్మించిన ఆ కాంట్రాక్టర్‌కు ఇంకా బిల్లు కూడా మంజూరు కాకపోవడం గమనార్హం.

కాగా వచ్చే నెలలో కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల ఆధ్వర్యంలో జరిగే క్రికెట్‌ టోర్నమెంటు కొరకు ఈ కళాశాల స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ కళాశాలకు చెందినట్లు వివరించారు.