హెవీ ప్రెషర్ వ్యాక్యూమ్ క్లీనర్ డెమో పరిశీలన

సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి): పట్టణంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్స్ ప్రతి నిత్యం   పరిశుభ్రంగా ఉంచేందుకు,శుభ్రం చేసే అధునాతన యంత్రాలను పరిశీలిస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ  అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.గురువారం స్థానిక కొత్తబస్టాండ్ వద్ద పబ్లిక్ టాయిలెట్స్ ను శుభ్రం చేసే అధునాతన యంత్రం హెవీ ప్రెషర్ వ్యాక్యూమ్ క్లీనర్ పనితీరును జిల్లా అడిషనల్ కలెక్ట్  పాటిల్ హేమంత్ కేశవ్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం పట్టణంలోని పలు ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.వీటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ, మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు అధునాతన యంత్రం పనితీరును పరిశీలిస్తున్నట్లు తెలిపారు.ఈ యంత్రాల పనితీరు బాగా ఉంటే  పట్టణంలోని  పబ్లిక్ టాయిలెట్లలో ప్రవేశ పెట్టనున్నట్లు చెప్పారు.మిషన్ పనితీరును తెలుసుకునేందుకు  డెమో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సూర్యాపేట పట్టణానికి  బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా  పేరు ఉందని, దాన్ని కాపాడుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ కమిషనర్  బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, సూర్యపేట పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సవరాల సత్యనారాయణ, 4వ వార్డ్ కౌన్సిలర్ లక్ష్మి, కోఆప్షన్ మెంబర్ స్వరూపరాణి , శానిటరీ ఇన్స్పెక్టర్  సారగండ్ల శ్రీనివాస్,జనార్దనరెడ్డి,  సీగెట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్ లాసా కంపెనీ ప్రతినిధులు రాకేష్ , ఫిరోజ్, శ్రీనివాస్ ,నలబోలు సైదిరెడ్డి, రత్నావత్ రాంబాబు, పెండ్రా రాము, వట్టే లింగరాజు,  అక్కెనపెల్లి మహేష్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
Attachments area