హైకోర్టును విభజించండి

3
– పార్లమెంట్‌ ప్రాంగణంలో టీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన

న్యూఢిల్లీ, జులై 24(జనంసాక్షి):

హైకోర్టు విభజనపై కేంద్రం చేస్తున్న తాత్సారాన్ని నిరసిస్తూ పార్లమెంట్‌ ఎదుట టీఆర్‌ఎస్‌ ఎంపీలు మరోమారు నిరసన వ్యక్తం చేశారు. పల్కార్డుఉల పట్టుకుని హైకోర్టును వెంటనే విభజించి న్యాయం చేయాలని నినాదాలుచేశారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ.. హైకోర్టు విభజనపై స్పష్టమైన హావిూ ఇచ్చే వరకు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తామని తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్రమోడీపై చంద్రబాబు, వెంకయ్యనాయుడు ఒత్తిడి చేస్తూ హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. మద్రాస్‌ హైకోర్టులో చెప్రాసి ఉద్యోగం కోసం ఆంధ్రా వాసులు పోరాడారు. ప్రత్యేక హైకోర్టు కోసం తాము పోరాడటం తప్పా అని ప్రశ్నించారు. హైకోర్టు విభజన అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లామని ఎంపి వినోద్‌ తెలిపారు. గతంలోనే హావిూఇచ్చినా ఇంతవరకు విభజన కార్యరూపం దాల్చలేదన్నారు. రాష్ట్రం ఏర్పడి 15 నెలలయినా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. దీనికోసం సభను అడ్డుకుంటూనే ఉంటామన్నారు. ఈ మేరకు వాయిదా తీర్మానం  కూడా ఇచ్చామన్నారు.