హైకోర్టు విభజనపై రాజ్‌నాథ్‌తో మంతనాలు

4

– గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటి

హైదరాబాద్‌,జూన్‌ 29(జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో సిఎం కెసిఆర్‌ అత్యవసరంగా సమావేశమయ్యారు.  టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుటాహుటిన రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. హైకోర్టు విభజన,న్యాయాధికారుల సమ్మె తదితరు సమస్యలను వీరు చర్చించారని సమాచారం. మరోవైపు హైకోర్టు విభజన అంశాలను కూడా చర్చించారని తెలుస్తోంది. కేంద్ర¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నుంచి ఫోన్‌ రావడంతో సిఎం కెసిఆర్‌ హుటాహుటిన రాజ్‌భవన్‌కు వెళ్లారు. కేంద్ర¬ంశాఖ మంత్రి రాజ్నాథ్‌ నుంచి కేసీఆర్కు ఫోన్‌ రావడంతో ఆయన హడావుడిగా వెళ్లినట్లు సమాచారం. బుధవారం ఉదయం టీఆర్‌ఎస్‌ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ భారత దేశంలో 125 కోట్ల జనాభా ఉంటే జిల్లాలు 683 ఉన్నాయని కేసీఆర్‌ చెప్పారు. దేశ వ్యాప్తంగా జిల్లాల్లో సగటు జనాభా 18.3లక్షలు అని అన్నారు. కానీ, తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇది 36లక్షలు ఉందని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. దసరాకు కొత్త జిల్లాల ఏర్పాటుపై అవసరమైన సూచనలు చేయండని కేసీఆర్‌ అన్నారు. కొత్త జిల్లాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఉంటుందని కేసీఆర్‌ చెప్పారు.

హెచ్‌ఐసీసీలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెరాస శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ… ప్రస్తుతం తెలంగాణలోని జిల్లాల సగటు జనాభా 36 లక్షలు.. ఒక అసెంబ్లీ నియోజకవర్గం రెండు, మూడు జిల్లాల్లోనూ విస్తరించవవచ్చని తెలపారు.జిల్లా కేంద్రానికి దగ్గరున్న మండలాలు అదే జిల్లా కేంద్రంలో ఉండాలని, దసరా నాడు కొత్త జిల్లాల్లో పనులు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. ముసాయిదాపై ప్రజలతో మాట్లాడి నివేదికలు ఇవ్వొచ్చని తెలిపారు. త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేసి పార్టీల అభిప్రాయం తీసుకుంటామని చెప్పారు.అన్ని రాష్ట్రాలు  పరిపాలనకు అనుగుణంగా ఎప్పటికప్పుడు జిల్లాల పునర్వభజన చేసుకున్నాయని… అదేవిధంగా తెలంగాణలోనూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. ఇప్పటివరకు 14 కొత్త జిల్లాల ప్రతిపాదనలు వచ్చాయని… ప్రజల అభిప్రాయం మేరకే జిల్లాల విభజన చేస్తామని స్పష్టం చేశారు. 73 కొత్త మండలాలు ఏర్పాటయ్యే అవకాశం ఉందన్నారు. ఈలోగా ఆయనకు రాజ్‌ నాథ్‌ నుంచి ఫోన్‌ రావడంతో సమావేశం మధ్యలో వెళ్లిపోయారు.