హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి

రాజాంరూరల్‌: శ్రీకాకుళం జిల్లా వంగర మండలం లక్ష్మీపేట గ్రామంలో దళితులపై జరిగిన మారణకాండపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పలువురు డిమాండ్‌ వ్యక్తం చేశారు. లక్ష్మీపేట  నేపథ్యంలో ఆదివారం రాజాంలో ఉత్తరాంధ్ర సదస్సు నిర్వహించారు. కులం, వర్గం, భూమి సంబంధాలు అనే అంశంపై వక్తలు మాట్లాడారు. సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమొక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వై.సాంబశివరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు జేవీ చలపతిరావు, టీఓ డబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య తదితరులు మాట్లాడుతూ లక్ష్మీపేట వంటి ఘటన రాష్ట్రంలో మరెక్కడా జరగకుండాదళితులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అందరిపై ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు మంత్రులు బొత్స, కొండ్రు మురళీలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు. సదస్సులో పలు సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.