హైదరాబాద్‌కు వర్ష సూచన

హైదరాబాద్‌ : నగరంలో నేడు కూడా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో మరో రెండు రోజుల పాటు అకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ భానుడి ప్రతాపానికి విలవిల్లాడిన నగరవాసులకు బుధవారం కురిసిన వర్షం వూరట కలిగించింది. నిన్న నగరంలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం కురిసిన వర్షానికి పలుచోట్ల చెట్లు, హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి. అర్థరాత్రి నుంచి మళ్లీ జల్లులతో మొదలై భారీ వర్షం కురిసింది.