హైదరాబాద్ అంటే నాకిష్టం
– ఫలక్‌నామా పాలెస్ అద్బుత కట్టడం: సచిన్
హైదరాబాద్ ఆగస్టు4(జనంసాక్షి):
హైదరాబాద్ అంటే తనకెంతో ఇష్టమని.. ఇక్కడ తనకెన్నో మధురస్మృతులు ఉన్నాయన్నారు. మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన స్పోర్ట్స్ పార్క్‌ను మంగళవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌పై తన అభిప్రాయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గతంలో బస చేశానని .. ఆ అనుభూతి ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. తనకు హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమన్నారు. హైదరాబాద్‌లో స్పోర్ట్స్ పార్క్ ఏర్పాటు చేయడం అభినందనీయమని సచిన్ అన్నారు. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్ అద్భుత కట్టడమని క్రికెటర్ సచిన్ తెందుల్కర్ అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్నమైన ఆటలు ఆడుకోవచ్చన్నారు. చక్కటి అనుభూతులతో మానసిక ఉల్లాసాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. స్పోర్ట్స్ పార్క్ ఏర్పాటుకు తాను కూడా సలహాలు ఇచ్చినట్లు సచిన్ తెలిపారు.