హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి

5

– స్వాగతం పలికిన సీఎం, గవర్నర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌18(జనంసాక్షి): శీతాకాల విడిది నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం  సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట విమాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితరులు ఘనస్వాగతం పలికారు. మండలి చైర్మన్‌ అసెంబ్లీ స్పీకర్‌

మధుసూధనాచారి, ఉపముఖ్యంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ, మంత్రులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనకు సాదర స్వాగతం పలికారు.మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, అసెంబ్లీ స్పీకర్‌ మధుసూధనాచారి, ఇతర ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. హకీంపేట నుంచి ఆయన నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు.  రాష్ట్రపతి 14రోజుల పాటు హైదరాబాద్‌లో బస చేయనున్నారు. ఈ నెల 31 వరకు రాష్ట్రపతి హైదరాబాద్‌లోనే బస చేయనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌

రావు నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఏపీ, కర్ణాటకలో జరిగే పలు కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. రాష్ట్రపతి ప్రతి ఏటా శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు రావడం తెలిసిందే.