హైదరాబాద్‌ చేరుకున్న సిద్ధరామయ్య

హైదరాబాద్‌ : ఒక రోజు పర్యటన నిమిత్తం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హైదరాబాద్‌ వచ్చారు. ఆయనకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో మంత్రి రఘువీరారెడ్డి, వీహెచ్‌లతో పాటు పలువురు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. సామాజిక న్యాయం ఒక్క కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని, ఆ విశ్వాసంతోనే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని సిద్ధరామయ్య అన్నారు. నేడు రవీంద్రభారతిలో కర్ణాటక సీఎంకు సన్మానం జరగనుంది.