హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు
హైదరాబాద్, జనంసాక్షి: హైదరాబాద్ నగర మార్కెట్లో మంగళవారంతో పోల్చితే ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,060లు కూడా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 25,540లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 45,700.