హైదరాబాద్ వర్సిటీ విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి క్యాంపస్ ఆవరణలో హాస్టల్ గదిలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. 21 వయస్సు గల ఆ విధ్యార్థి తీవ్రమైన ఒత్తిడిని తట్టురకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడిని వరంగల్ జిల్లాకు చెందిన దలిత విద్యార్థి పి.రాజుగా గుర్తించారు.
రాజు లింగ్విస్టిక్స్‌లో ఎంఎ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతను క్యాంపస్‌లోని ఎఫ్ హాస్టల్లో ఉంటున్నాడు. దిగ్బ్రాంతికరంగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లో మధ్యాహ్నం మూడున్నర గంటలకు డిప్రెషన్…….డిప్రెషన్….. కిల్స్ మీ ఎవ్రీ డే అంటూ మేసేజ్ పోస్టు చేశాడు.
మిత్రులు అతని వద్దకు వచ్చి మాట్లాడి వెళ్లారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సెమిస్టార్ రిజిస్ట్రేషన్‌కు అనుమతించలేదని. ఆ గడువు డిసెంబర్‌తో ముగిసిందని రిజిస్ట్రేషన్ లేకుండా పరీక్షలకు అనుమతించరని, బ్యాక్‌లాగ్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.
కాగా విద్యార్థులు హెచ్‌సియు వైస్ చాన్సిలర్ రామకృష్ణ్ర రామస్వామి ఘెరావ్ చేశారు. రాజును రిజిస్ట్రేషన్‌కు ఎందుకు అనుమతించలేదని నిలదీశారు. బుధవారం క్యాంపస్ బంద్ జరుగుతోంది. విశ్వవిద్యాలయం నిర్లక్ష్యాన్ని నిరసిస్తున్నట్లు అంభేడ్కర్ విధ్యార్థి సంఘం ప్రతినిధులు అంటున్నారు