హైదరాబాద్‌ విజయనగర్‌ కాలనీలో భారీ పేలుడు

7ncy1izmకార్ల వర్క్‌ షాపులో పేలిన ఐదు సిలిండర్లు

హైదరాబాద్‌, మార్చి 15 : నగరంలోని మాసబ్‌టాంక్‌ విజయనగర్‌ కాలనీలోని కార్ల వర్క్‌ షాపులో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. వర్క్‌షాపులోని ఐదు సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న కార్‌ షెడ్‌లకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మొత్తం 12 ఫైర్‌ ఇంజన్లు మంటలను అదుపులోకి తేచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దట్టమైనపొగ కాలనీ మొత్తం వ్యాపించింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.