హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం
పుణే : ఐపీఎల్ -6లో భాగంగా పుణేతో జరిగిన మ్యాచ్‌లోహైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టు 119 పరుగులు సాధించగా 120 పరుగుల విజయలక్ష్యంతో దిగిన పూణే జట్టు కేవలం108 పరుగులకే ఆలౌటై అపజయాన్ని మూటగట్టుకుంది.పూణే బ్యాట్‌మెన్స్ లలో ఉతప్ప,(22),మాథ్యూస్ (20), స్మిత్ (17) పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో అమిత్ మిశ్రా హైట్రిక్ సాధించగా ఫెరిరా 3వికెట్లు, ఇషాంత్ శర్మ ,స్టేయిన్ ,కె.వి.శర్మ తలో వికెట్ తీసి తమ జట్టుకు విజయాన్ని సాధించి పెట్టారు.