హైదరాబాద్ ఎన్ జీవో కాలనీ బస్టాప్ లో ఉద్రిక్తత
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతోంది. శాంతియుత నిరసన పలుచోట్ల ఘర్షణకు తావిస్తోంది. హైదరాబాద్ శివారు హయత్నగర్ డిపో పరిధిలోని… ఎన్ జీవో కాలనీ వద్ద… తోపులాట జరిగింది. కార్మికులు సమ్మెకు దికటంతో… అధికారులు తాత్కాలిక పద్దతిన… సిబ్బందిని నియమించుకొని… బస్సులు నడిపాలని నిర్ణయించారు. ఎన్ జీవో కాలనీ బస్టాప్ నుంచి బస్సులు బయటకు తీస్తుండగా.. కార్మికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా… రంగంలోకి దిగిన పోలీసులు… 40 మంది ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేశారు.