హైదరాబాద్ చేరుకున్న సింధు, సైనా, గోపిచంద్
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో విజయం కోసం తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపింది పీవీ సింధు. ప్రపంచ బ్యాడ్మింటన్ ముగిసిన తర్వాత కోచ్ గోపీ చంద్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్న సింధు.. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వాల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం గెలవడంపై సింధు సంతోషం వ్యక్తం చేసింది.
ఫైనల్ లో ఓటమి బాధించిందనీ.. అయితే నా ఆట పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాననీ తెలిపింది. వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించడమే లక్ష్యమన్నసింధు… ప్రధాని మోడీ అభినందించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపింది. ప్రస్తుతం వరల్డ్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్ లో సింధు నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది.
వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ ఫైనల్ లో సింధు అద్భుతంగా రాణించిందన్నారు కోచ్ పుల్లెల గోపీచంద్ .ఈ మ్యాచ్ లో స్వర్ణం ఖాయమని భావించామమన్నాడు. భవిష్యత్ లో సింధు తప్పకుండా స్వర్ణం సాధిస్తుందన్నాడు గోపీచంద్.