హైదరాబాద్ నగరాన్ని సమాంతరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి

తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్పో ను  ప్రారంభించిన మంత్రి
 ఎల్బీనగర్ (జనం సాక్షి ) సీఎం కేసీఆర్మం,త్రి కేటీఆర్ సారథ్యంలో   హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకువచ్చే విధంగా తీర్చి దిద్దుతున్నారని కార్మిక శాఖ మంత్రి కూరమల్లారెడ్డి అన్నారు. శనివారం నాడు ఎల్బీనగర్ సరూర్ నగర్  లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్పో ప్రాపర్టీ షో ను మంత్రి ముఖ్య   అతిథిగా హాజరై, ఎమ్మార్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజల్వ న చేసి   ప్రారంభించారు.మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరాన్ని సమాంతరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈస్ట్ జోన్ ప్రాంతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రాపర్టీ ఎక్స్ ఫోను  ఈ ప్రాంతంలో పెట్టడం నియమని అన్నారు.  ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎల్బీనగర్కు ముహర్దశ  రాబోతుందని అన్నారు. భారత దేశంలోనే అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలో ప్రపంచ దేశాలు పెట్టుబడులకు హైదరాబాద్ నగరం వైపు చూసే విధంగా తీర్చి దిద్దుతున్నారని అన్నారు. ఎల్బి నగర్ వదిన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ట్రాఫిక్ ను అధికమించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్పాసులు, ఏర్పడుతోపాటు స్కై వే లు  నిర్మించబోతుందని అన్నారు .  రానున్న రోజుల్లో మూసీ నది స్వరూపమే మారుతుందని మూసి ఇరువైపులా 120 ఫీట్లతో  రోడ్ల నిర్మాణం చేపడుతుందని అన్నారు. ఈ ప్రాంతంలో భారతదేశంలో  ఎక్కడ లేని విధంగా పార్కులు ఏర్పాటు చేశామని ఉన్నారు. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ప్రాపర్టీ షోలో టి ఎన్ ఆర్ కన్స్ట్రక్షన్స్, ఏవి కన్స్ట్రక్షన్స్, మారుతి రుద్ర, సన్ సిటీ, విజేత,మారం,  వివిధ రకాల కన్స్ట్రక్షన్స్, కంపెనీలు పాల్గొన్నాయి. కార్యక్రమంలో ముంబై నుంచి ఎన్. పి  రాజన్, తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు ప్రభాకర్ రావు, జనరల్ సెక్రెటరీ  నరసింహారావు, కన్వీనర్ రవీంద్ర కుమార్, కో కన్వీనర్ విద్యాసాగర్, సతీష్ శ్రీనివాస్. రాజారెడ్డి . క్రెడాయ్ అధ్యక్షులు రామ్ రెడ్డి .  తదితరులు పాల్గొన్నారు