హోదాతోనే హావిూలకు భరోసా: నాని
విజయవాడ,జూన్22(హో): అధికారం చేజిక్కించుకునేందుకు ఎన్నికలలో చంద్రబాబు వందల సంఖ్యలో వాగ్దానాలు చేశారని, వాటిలో ఏ ఒక్కదాన్నీ నాలుగేళ్ల పాలనలో నెరవేర్చలేకపోయారని వైకాపా అధికార ప్రతినిధి పేర్ని నాని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పోలవరాన్ని భూస్థాపితం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. పోలవరం కుడికాల్వపై పట్టిసీమ నిర్మించి రూ.1600 కోట్లు చంద్రబాబు దోచుకున్నారన్నారు. ఇప్పుడు ఎడమకాల్వపై పురుషోత్తమపట్నం పేరుతో మళ్లీ దోపిడీకి తెరలేపారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే తప్ప ఏపీకి న్యాయం జరగదని ఆయన అన్నారు. నామ మాత్రపు నిధులిచ్చి ఏపీ ప్రజలను కేంద్రం అవమానించడం సరికాదన్నారు. రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులపై చంద్రబాబు మాట్లాడకపోవడం సరికాదని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ¬దా లేదు, రాజధానికి నిధులు లేవు, పోలవరాన్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన నిధులు కేటాయించి ఏపీని కేందప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.చంద్రబాబు తక్షణం స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ప్రజలు కోరుకుంటున్నది ప్యాకేజీ కాదు, ప్రత్యేక ¬దా అని ఆయన అన్నారు. ప్రత్యేక ¬దా వస్తే పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, వారు సమయం కోసం వేచి చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు తమను దగా, మోసం చేశారని ప్రజలు భావిస్తున్నారన్నారు. ప్రజలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలే దీనికి నిదర్శనమని చెప్పారు.