హోదాపోరు ఇక మరింత ఉధృతం
ఆందోళనలను ఖరారు చేసిన టిడిపి
20న కడపలో ఉక్కు ఫ్యాక్టీరీ కోసం పోరు
టిడిపి ఎంపిల వెల్లడి
అమరావతి,జూన్15(హో): విభజన హావిూల సాధన, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా అమలు కోసం పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని టిడిపి ఎంపీలు అన్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని చెప్పారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఎంపీలంతా సంయుక్తంగా నిర్వహించిన విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఈ నెల 20న కడపలో, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు ఈ నెల 27న ఆందోళన చేపడతామని వెల్లడించారు. వెనుకబడిన జిల్లాలకు జరిగిన అన్యాయంపై జులై 4న అనంతపురంలో నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని పేర్కొంటూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేసినా.. వైకాపాలో ఎలాంటి స్పందనా లేదన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ కోసం ఈ నెల 20న కడపకు వెళ్లనున్నట్టు తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చి మళ్లీ ఏ ప్రాతిపదికన తిరిగి తీసుకున్నారో కేంద్రం చెప్పాలని ఎంపీ కొనకళ్ల నారాయణ డిమాండ్ చేశారు. ఆకుల సత్యనారాయణతో కలిసి వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భాజపా నేత రాంమాధవ్ వద్దకు వెళ్లారని, లాగ్ పుస్తకంలో సంతకాలు కూడా చేశారని తెలిపారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నయన్నారు. రాష్టాన్రికి అన్యాయం చేసేలా ప్రవర్తిస్తోన్న కేంద్రంపై అవిూతువిూ తేల్చుకొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.