హౌజింగ్ సొసైటీ ఆఫీసులో సీఐడీ సోదాలు
హైదరాబాద్, జనంసాక్షి: జూబ్లిహిల్స్ హౌజింగ్ సొసైటీ కార్యాలయంలో సీఐడీ అధికారులుల సోదాలు నిర్వహించారు. ఇవాళ ఉదయం సీఐడీ ఎస్పీ కల్పన ఆధ్వర్యంలో ఓ అధికారుల బృందం కార్యలయంకు వెళ్లి తనాఖీలు చేశారు. 199 సంవత్సరంలో భూమల కేటాయింపుల్లో అవకతవకలకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను పరిశీలించారు. ఈ కేసులో కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయనున్నందున దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా, ఈ కేసును మొదట విజిలెన్స్ విభాగం దర్యాప్తు చేయగా, దాన్ని ప్రస్తుతం సీఐడీ విభాగానికి బదిలీ చేశారు.