01పి, మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరాపాక ప్రభాకర్
అగ్నిపత్ పథకం తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉప సంహరించుకోవాలి
… టిడిపి రాష్ట్ర కార్యదర్శి బైరాపాక ప్రభాకర్
స్టేషన్ ఘన్పూర్, జూన్ 25, ( జనం సాక్షి) : అగ్నిపత్ పథకం తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైరాపాక ప్రభాకర్ డిమాండ్ చేశారు.
స్టేషన్గన్పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండల అధ్యక్షుడు బత్తిని ఎల్లయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఫతేపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిల్పూర్ మండ లం ప్రధాన కార్యదర్శి గుగులోత్ మోహన్ నాయక్ సభ్యత నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ స్థానిక నాయకులు భైర పాక ప్రభాకర్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్టేషన్గన్పూర్ నియోజకవ ర్గంలో అన్ని మండలాలలో గ్రామస్థాయిలో పూర్తి గా స్వచ్ఛందంగా సభ్యత నమోదు చేపట్టడం జరుగుతుంది అని అన్నారు. అగ్నిపత్ తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని, నిరు ద్యోగ యువతపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివే యాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి భైరపాక ప్రభాకర్ అన్నారు. దేశంలో రోజురోజుకీ నిరుద్యోగ సమస్య పెరుగుతుందని కేంద్ర ప్రభు త్వం ప్రవేశపెట్టిన అగ్ని పథకం ద్వారా నిరుద్యోగ యువతకుఅన్యాయం జరుగుతుందని అన్నారు. ప్రైవేటు ఏజెన్సీల ఉద్యోగుల లాగా సైనికుల నియమిస్తే ఉద్యోగ భద్రత లేని సైనికులు దేశసేవ ఎలా చేస్తారని ఆరోపించారు. సికింద్రాబాదు ఘట నలో మృతి చెందిన రాకేష్ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్ గ్రేసియా చెల్లిం చాలని,రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షలఎక్స్ గ్రేషి యా చెల్లించాలని, అదేవిధంగా ఆ కుటుంబానికి చెందినటువంటి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిం చాలని, 17 నుండి 21 సంవత్సరాలలో ఉన్న నిరుపేద కుటుంబానికి చెందిన యువకులు దేశ సేవలో ప్రాణాలు పోయినా లెక్కచేయకుండా దేశ సేవ చేయాలనే కోరికతోయువత ముందుకు నడు స్తుందని అన్నారు. అగ్ని పథకం ద్వారా నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉద్యోగ భద్రత ఉంటుంద ని ఆతర్వాత పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుం దని అన్నారు.తక్షణమే కేంద్ర ప్రభుత్వం అగ్ని పథ కాన్ని ఉపసంహరించుకుని నిరుద్యోగ యువకుల పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో యువతకు అండగా ఉంటూ కార్యక్రమాలు చేపడతామని బైరపాక ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బానోతు సురేష్, ధారావత్ రవి,బత్తిని శ్రీధర్ గౌడ్, తెలుగుదేశం పార్టీ కార్యాలయం కార్యదర్శి పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.