02పి, మాట్లాడుతున్న చల్ల ఉమా సుధీర్ రెడ్డి

గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి
… సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి
స్టేషన్ ఘన్పూర్, జూన్ 18, ( జనం సాక్షి ):  గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ చల్ల ఉమా సుధీర్ రెడ్డి అన్నారు. తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5వ విడుత పల్లె ప్రగతి  కార్యక్రమంలో భాగంగా తాటికొండ గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామ సర్పంచ్ చల్ల ఉమ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పల్లె ప్రగతి ముగింపు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. పల్లె ప్రగతి  కార్యక్రమంలో భాగంగా ఈ15 రోజుల పాటు జరగినకార్యక్రమాలన్నీఅన్నిటినీ ముగింపు గ్రామ సభ లో చెప్పడం జరగింది. ముగింపు గ్రామ సందర్భంగా గ్రామం లో జరిగిన అభివృద్ధి పనుల గురించి,తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులు, విధి దీపాల నిర్వహణ, వీధులను పరిశుభ్రంగా చేయుట,హరితహారంమొక్కలునాటుట గురించి, వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ఇంటిపరిసరాలలో  నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని గ్రామ ప్రజలకు సూచించడం జరిగింది. అలాగే ప్రతి  ఇంటింటికి ఇంకుడు గుంతలు కట్టుకోవాలని కోరడం జరిగిం ది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగావైస్ ఎంపీపీ చల్ల సుధీర్ రెడ్డి,ఉపసర్పంచ్ మారపాక రాము లు ,వార్డు మెంబర్లు, కో ఆప్షన్ మెంబెర్స్ బేతి మంజుల , అంగన్వాడీ టీచర్స్ పద్మ, ధనలక్ష్మి, సులోచన, లలిత, , అరుణ దేవి, హెల్త్ డిపార్ట్మెం ట్ ఏఎన్ఎం అరుణ, ఎలీషా ఆశ కార్యకర్తలు, స్పెషల్ ఆఫీసర్ యసర్ , పంచాయతీ కార్యదర్శి జేల్లెల్ల శేఖర్ , లైన్ మెన్ ఐలయ్య , గ్రామ పెద్దలు, యూత్ నాయకులు, గ్రామ కారోబార్ ఎండీ. సలీం, గ్రామ సిబ్బింది తదితరులు పాల్గొన్నారు.