1వ తేదీ నుంచి తల్లిపాల వారోత్సవాలు

విద్యానగర్‌: గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యాన్ని తెలిపేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డా.యం.మాణిక్యరావు ఒక ప్రకటలనలో పేర్కొన్నారు. అందులో భాగంగానే జూలై 31 అర్థరాత్రి నుంచి ఆగస్టు 1వ తేదీ అర్థరాత్రి వరకు ఎంత మంది గర్బిణులు ప్రసవించారు. ఎంత మంది శిశువులు జన్మించారు. వీరిలో ఎంత మంది తల్లులు గంటలోపు తమ శిశువులకు తల్లిపాలు పట్టారు. తదితర వివరాలను ఆయా పీహెచ్‌సీ నుంచి రిపోర్టులను పంపించాలని సూచించారు. ఆయా గ్రామాల పరధిలో ఉండే ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలు, క్లస్టర్ల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. తల్లిపాలు, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల అవసరంపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.