1 00 000 రూ,, ఎల్వోసిని కుటుంబ సభ్యులకు అందజేసిన సర్పంచు కె సత్యనారాయణ యాదవ్.
కోడేరు (జనం సాక్షి) అక్టోబర్ 12 కోడేరు మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామానికి చెందిన నరసింహ కి 1,00,000/- రూపాయల ఎల్వోసి ని అందించిన నర్సాయిపల్లి గ్రామ సర్పంచ్ కొమ్మ సత్యనారాయణ యాదవ్, నర్సాయిపల్లి గ్రామంలో పార్టీ కోసం ప్రతిష్టంగా పనిచేసినటువంటి డి నరసింహ అనారోగ్య కారణాలవల్ల నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతున్నది. ఆ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్ రెడ్డి, వారికి హాస్పిటల్ చికిత్స కోసం లక్ష రూపాయల ఎల్వోసి మంజూరు చేయించడం జరిగింది, ఈ యొక్క ఎల్వోసిని వారికి అందించి అక్కడ చికిత్స చేస్తున్నటువంటి డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. అలాగే నరసింహ కి కావలసినటువంటి చికిత్సకు అయ్యేటువంటి ఖర్చులు మళ్లీ ఎల్వోసి ధార అందిస్తామని వారికి తెలియజేయడం జరిగింది. డి నరసింహ ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తూ ఏమైనా అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసా కల్పించడం జరిగింది, సర్పంచ్ వెంట గ్రామ ఉపసర్పంచ్ ఈశ్వర్ కలుమూరి వెంకటేష్, సంధ్య కురుమూర్తి ఉన్నారు.