10నుంచి చెక్కుల పంపిణీతో గ్రామాల్లో పండగవాతావరణం
కామారెడ్డి,ఏప్రిల్21(జనంసాక్షి): రైతు బంధు పథకం కింద పంటలు సాగు చేసేందుకు పెట్టుబడి సహాయం కింద మే 10 నుంచి గ్రామాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభిసార్తని రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి అన్నారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొననుందన్నారు. రైతులకు ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు రూ. 8వేలు అందించే బృహత్తర పథకానికి శ్రీకారం
చుట్టబోతున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కృషిచేస్తున్నారన్నారు. ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి పోచారంపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ప్రజల్లో మనుగడ కోసం మంత్రిపై అనవసర వాఖ్యలు చేస్తే సహించేది లేదని, ప్రజలే గట్టి బుద్ధి చెబుతారని అన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రి కృషిచేస్తున్నారన్నారు.