10న మంచిర్యాలలో పిఆర్‌టియూ సమావేశం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): పీఆర్‌టియూ జిల్లా ద్వితీయ కార్యనిర్వాహక వర్గ సమావేశాన్ని ఈనెల 10న మంచిర్యాలలో ఏర్పాటుచేసినట్లు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి తిరుమల్‌రెడ్డి ఇన్నారెడ్డి తెలిపారు. స్థానిక  పద్మావతి గార్డెన్స్‌లో ఉదయం పదిగంటలకు సమావేవం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులతోపాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరువుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా ఏళ్లుగా పరిష్కారం కాని ఏకీకృత సర్వీసు రూల్స్‌కు సంబంధించి రాష్ట్రపతిభవన్‌కు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదన్నారు. వివిధ సమస్యలపై సమావేవంలో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొదిస్తామని అన్నారు.