10 లక్షలతో డ్రైనేజీ పనులు ప్రారంభం
మేడిపల్లి – జనంసాక్షి
బోడుప్పల్ నగరపాలక సంస్థ 21వ డివిజన్ పరిధిలోని ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో పది లక్షల రూపాయలతో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్, స్థానిక కార్పొరేటర్ భూక్య సుమన్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టిఆర్ఎస్ కమిటీ సభ్యులు వెలుగొండయ్య, నరేందర్ రెడ్డి, విజయలక్ష్మి, సత్యనారాయణ, సూర్య ప్రకాష్, నాయకులు సురేష్, రవీందర్, కాలనీ అసోసియేషన్ సభ్యులు సుబ్బారావు, చంద్రం, రంగయ్య, వెంకట్ , కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area