10 లక్షల మొక్కలకు గ్రేటర్ ప్రణాళికలు
మొక్కల పంపిణీకి 13 కేంద్రాల ఏర్పాటు
వరంగల్,జూలై24(జనంసాక్షి): నాల్గో విడత హరితహారం విజయవంతానికి గ్రేటర్ వరంగల్‌లో 10 లక్షల మొక్కలు నాటేలా అధికారులు శ్రమిస్తున్నారు. ఇందుకు ఇంటికి నాలుగు మొక్కలు అందించేలా చర్యలు చేపట్టారు. అలాగే మొక్కల పెంపకానికి డివిజన్‌కు ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమానికి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పక్కా ప్రణాళికలతో ముందుకుపోతోంది. ముఖ్యంగా పండ్లు, పూల మొక్కలను ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని గ్రేటర్ అధికారులు భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 13 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మొక్కలు అం దించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కార్పొరేషన్ లెక్కల ప్రకారం నగరంలో ఇంటికి నాలుగు మొక్కల చొప్పున 7,53,524 మొక్కలు పంపిణీ చేయనున్నారు. అందుకోసం మొక్కలను అందుబాటులో ఉంచారు. కార్పొరేషన్ పరిధిలో మొక్కల పంపిణీకి 13 కేంద్రాలను ఎంపిక చేశారు. నక్కల గుట్ట వాటర్ ట్యాంక్, మచిలీబజార్ సీఆర్‌సీ భవన్, సుబేదారి వాటర్ ట్యాంక్, కాజీపేట వాటర్ ట్యాంక్, పలివేల్పుల వాటర్ ట్యాంక్, ఆటోనగర్ వాటర్ ట్యాంక్, రంగశాయిపేట వాటర్ ట్యాంక్, కరీమాబాద్ వాటర్ ట్యాంక్, శివనగర్ వాటర్ ట్యాంక్, లేబర్ కాలనీ వాటర్ ట్యాంక్, కాశీబుగ్గ వాటర్ ట్యాంక్, చార్‌బౌళి వాటర్ ట్యాంక్, దేశాయిపేట ఫిల్టర్ బెడ్‌లలో ప్రజలకు మొక్కలు పంపిణీ చేయనున్నారు. డివిజన్ పరిధిలోని గృహల సంఖ్య ప్రకారం ఇంటికి నాలుగు మొక్కలు అందచేస్తున్నారు.కడిపికొండ జాతీయ రహదారి నుంచి కేయూ వరకు 10 కిలో విూటర్లు, కేయూ వయా పబ్లిక్ గార్డెన్ 4 కిలోవిూటర్లు, పబ్లిక్ గార్డెన్ నుంచి ములుగు రోడ్ వరకు 4 కిలోవిూటర్ల రహదారి వెంబడి 6,400 మొక్కలు నాటాలని అధికారులు ప్రణాళికలు సిద్దం చేశారు. ప్రభుత్వ భననాలు, కార్పొరేషన్ సర్కిల్ కార్యాలయాలు, కలెక్టరేట్, పోలీస్ క మిషనరేట్, జిల్లా కోర్టు ప్రాంగణాల్లో 15 వేల మొక్కలు నాటనున్నారు. గ్రేటర్ పరిధిలోని 14 పాత పార్కుల పునరుద్దరణలో భాగంగా 876 మొక్కలు, మడికొండ నుంచి ఖాజీపేట ప్రధాన రహదారి, శంభునిపేట నుంచి నాయుడు పంపు వరకు ప్రధాన రహదారిపై ఉన్న 8
కిలోవిూటర్ల డివైడర్లలో 3 వేల మొక్కలు నాటనున్నారు. లే అవుట్ ఖాళీ స్థలాల్లో 4 వేలు, కార్పొరేషన్ అభివృద్ధి చేయనున్న 50 కొత్త పార్కుల్లో,డంపింగ్ యార్డు, సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో మొక్కలు నాటనున్నారు. కొత్త జంక్షన్లు అయిన సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ భవన్ వరకు 4 కిలోవిూటర్లు, కడిపికొండ నుంచి బట్టుపల్లి విూదుగా ఉర్సు గుట్ట వరకు 5 కిలోవిూటర్లు వరకు 12 వేల మొక్కలు, బంధం చెరువు, భద్రకాళి బండ్, వడ్డేపల్లి, కోట చెరువుల వద్ద 20 వేలు నాటేందుకు ప్రణాళికలు చేశారు. గ్రేటర్‌లో నిర్మిస్తున్న 4 స్మార్ట్ రోడ్ల వెంట 3200 మొక్కల నాటనున్నారు.