ప్రబలిన డయేరియా: 10 మందికి అస్వస్థత

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో మళ్లీ డయేరియా జాడలు కనిపిస్తున్నాయి. తాజాగా పెద్దపల్లి మండలం చందపల్లిలో కొంతమందికి డయేరియా సోకింది. 10 మందికి డయేరియా లక్షణాలు కనిపించడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలో డయేరియా వ్యాధి సోకినట్లు తెలుస్తుంది.