1066వ రోజుకు చేరిన తెలంగాణ దీక్షలు
ఆదిలాబాద్, డిసెంబర్ 4 ): ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీలు నడుచుకోవాలని ఐకాస నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు మంగళవారంనాటికి 1066వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తేనే ప్రజలు గుర్తిస్తారని వారు అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో అందరూ కలిసికట్టుగా పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రం వచ్చేంతవరకు ఉద్యమాన్ని విరమించేంది లేదని హెచ్చరించారు.