108 హోమగుండాలతో శతచండీయాగం
ఆదిలాబాద్ సాంస్కృతికం: మావల గ్రామ పంచాయితీ పరిధిలోని దుర్గానగర్‌లో ఉన్న నవదుర్గా మాత మందిరంలో శనివారం శతచండీ మహాయాగం వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ప్రారంభమైంది. ఈ యాగం మూడు రోజుల పాటు జరగనుంది. తొలిరోజైన శనివారం గణపతి పూజ, యాగశాల ప్రవేశం. 108 హోమగుండాలతో చండీయాగం, లక్షకుంకుమార్చన, చతుర్వేద పారాయణం తదితర కార్యక్రమాలను వేద పండితులు భక్తులతో చేయించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వేద పండితులు, భక్తులు హాజరయ్యారు. లోక కల్యాణార్థం శతచండీయాగం చేపట్టినట్లు యజ్ఞ వ్యవస్థాపకులు కిషన్ మహరాజ్ తెలిపారు. భక్తులందరికీ భోజన వసతి కల్పించారు. విరామ సమయంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన యజ్ఞాచార్యులు రామచంద్ర శర్మ మాట్లడుతూ సర్వ ప్రాణికోటికి నీరు, ఆహారం, సమృద్ధిగా లభించాలని ఈ యాగం చేస్తున్నట్లు చెప్పారు.