11వేల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం
ఉపప్రణాళిక చట్టబద్ధతకు 30,1న అసెంబ్లీ సమావేశాలు
త్యాగి కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం
29న మరోసారి సమావేశం: డికె అరుణ
హైదరాబాద్,నవంబర్23(ఆర్‌ఎన్‌ఎ): మూడు నెలల సుదీర్ఘ విరామం తరవాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరోమారు ఈ నెల 29 న మంత్రివర్గం మరోసారి సమావేశమై ఉప ప్రణాళిక ముసాయిదాకు ఆమోదం తెలుపాలని నిర్ణయించింది. పెట్టుబడి రాయితీ పెంపుపై కూడా ఆరోజే నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశానంతరం వివరాలను సమాచార శాఖ మంత్రి డికె అరుణ విలేకర్లకు వివరించారు. కేబినెట్ సమావేశం పలు అంశాలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు డిఏ పెంపు, స్విమ్స్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి డికె అరుణ తెలిపారు. కోనేరు రంగారావు కమిటీ- సిఫార్సు మేరకు భూ కేటాయింపుల చట్ట సవరణకు ఆమోదం లభించింది. వివిధ శాఖల్లో సుమారు 11 వేల పోస్టుల భర్తీకి కేబినెట్ ఓకే చెప్పింది. పెంచిన డిఎకు ఆమోదం తెలిపింది. ఉప ప్రణాళిక చట్టబద్ధత కోసం ఈ నెల 30, డిసెంబరు 1న శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి డీకే అరుణ తెలిపారు. సీఎం అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. నీలం తుపాను నష్టం అంచనాలు పూర్తిగా వచ్చిన తర్వాత పెట్టుబడి రాయితీ పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ధర్మాన విచారణకు అనుమతి నిరాకరించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. చిన్న మొత్తాల పొదుపు సంస్థ రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, ఆ సంస్థలోని సిబ్బందిని తిరిగి మాతృసంస్థలోకి బదిలీ చేయాలని నిర్ణయించారని, పొదుపు సంస్థ లావాదేవీలు ఇకపై ఆర్థిక శాఖ పర్యవేక్షిస్తుందని మంత్రి డీకే అరుణ తెలిపారు.
వైఎస్‌ఆర్ మృతిచెందిన హెలికాప్టర్ ఘటనకు సంబంధించి విచారణ కమిటీ నివేదిక కేబినెట్ ముందుకు చర్చకు వచ్చింది. ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్‌పై మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికకు కూడా కేబినెట్ ముందుకు వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రయాణించిన హెలిక్టాపర్ ప్రమాదంపై ఆర్.కె. త్యాగి కమిటీ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ హెలిక్టాపర్ ప్రమాదం వెనుక ఎలాంటి కుట్ర లేదని త్యాగి కమిటీ నివేదించింది. పలు శాఖల్లో 11,420 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.విద్యాశాఖలో 11,142 పోస్టుల భర్తీకి, వివిధ శాఖల్లోని 278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖలో 22 అంశాలకు సంబంధించి రూ. 471 కోట్లు మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్విమ్స్ చట్టానికి సవరణ చేసి సిఎం స్థానంలో ఛైర్మన్‌గా వైద్యశాఖ మంత్రి ఉండేలా ఆమోదించారు. నీలం తుపాను నష్టంపై మంత్రివర్గం అధికారుల వివరణ కోరింది. ఈ సమావేశంలో మంత్రి ధర్మాన అంశంపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ధర్మానపై సీబీఐ విచారణకు మంత్రివర్గం అనుమతి నిరాకరించింది. మూడు నెలల తర్వాత జరుగుతున్న ఈ మంత్రివర్గ సమావేశానికి ఐదురుగు మంత్రులు గైర్హాజరయ్యారు. ఐదుగురు మంత్రులు తప్ప మొత్తం మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. మంత్రులు గీతారెడ్డి, గల్లా అరుణకుమారి, గంటా శ్రీనివాసరావు, రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు ఈ ఐదుగురు వివిధ కారణాలవల్ల కేబినెట్ విూట్‌కు హాజరు కాలేదు. గీతారెడ్డి పుట్టపర్తి వేడుకలకు వెల్లారు. గల్లా అరుణకుమారి అమెరికా పర్యటనలో వున్నారు. గంటా శ్రీనివాసరావు కాలికి గాయమై చికిత్స తీసుకుంటు-ంగా, రఘువీరా హంద్రీనీవా పాదయాత్ర చేస్తున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామా వ్యవహారం ఇంకా కొలిక్కి రాకపోవడంవల్ల ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. ధర్మాన విషయంలో చర్చ అనవసరమని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నట్లు తెలిసింది. అయితే ఆయనను జానారెడ్డి వారించారని సమాచారం.
ఉపాధి హావిూ కింద అదనంగా మరో 50 రోజుల పని
ఉపాధి హావిూ పథకం కింద గ్రావిూణ ప్రాంతాల్లో వందరోజులు పని పూర్తి చేసుకున్న కూలీలకు అదనంగా 50 రోజులు పని దినాలు కల్పించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉపాధి హావిూ పథకం అమలు తీరుపై ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు 3854 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ సవిూక్షా సమావేశంలో మంత్రి మాణిక్య వరప్రసాద్‌తోపాటు గ్రావిూణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.