భోజనం వికటించి 11 విద్యార్థులకు అస్వస్థత

కరీంనగర్‌,(జనంసాక్షి): మధ్యాహ్నం భోజనం వికటించి 11 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మల్లాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. చికిత్స నిమిత్తం విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.